మూవీడెస్క్: నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి దర్శకుడిగా ప్రశాంత్ వర్మ వ్యవహరించబోతున్నారు.
ప్రీప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఉంటుందట, కానీ కథకు సంబంధించి వివరాలు ఇంకా వెల్లడించలేదు.
ఇది మోక్షజ్ఞ లాంచ్‌కి పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ అని అభిమానులు భావిస్తున్నారు. అయితే మొదటగా మోక్షజ్ఞ ‘ఆదిత్య 999’ సీక్వెల్‌తో ఎంట్రీ ఇస్తాడని బాలకృష్ణ తెలిపారు.
కానీ ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేదు. అది క్యాన్సిల్ అయితే కాలేదని తెలుస్తోంది. అడ్వాన్స్‌డ్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఉన్న ‘ఆదిత్య 999’ భారీ బడ్జెట్ కావడంతో, మొదటి సినిమాతోనే రిస్క్ తీసుకోవడం బాలయ్యకు ఇష్టం లేదట.
అందుకే ముందు ఒక మినిమమ్ బడ్జెట్ చిత్రంతో మోక్షజ్ఞని లాంచ్ చేస్తే పాన్ ఇండియా స్థాయిలో మంచి ఇమేజ్ వస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఆ సినిమా రిజల్ట్ ను బట్టి ఆదిత్య 999 వచ్చే అవకాశం ఉంటుంది.