మూవీడెస్క్: నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా వెండితెర ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మొదలవ్వాల్సిన సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడంతో మోక్షజ్ఞ ఎంట్రీ పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే మేకర్స్ ఈ ప్రాజెక్ట్ అనుకున్నట్టే ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
ఇక మోక్షజ్ఞతో సినిమా చేసే దర్శకుల జాబితాలో ఇప్పుడు దర్శకుడు బాబీ కూడా చేరారు.
బాలకృష్ణతో ‘డాకు మహారాజ్‘ సినిమా చేసిన బాబీ, మోక్షజ్ఞ గురించి తన అభిప్రాయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
“మోక్షజ్ఞ మూడు నాలుగు సార్లు సెట్స్‌కి వచ్చారు. ఆయన హైట్, లుక్స్, షార్ప్ ఫీచర్స్ అతనికి ప్రత్యేక ఆకర్షణ.
నేర్చుకోవాలనే తపన కూడా ఎక్కువగా ఉంది. అలాంటి కుర్రాడితో సినిమా చేసే అవకాశం వస్తే వదులుకోను,” అని బాబీ అన్నారు.
ఈ వ్యాఖ్యలు నందమూరి అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించాయి.
మోక్షజ్ఞ ఎంట్రీపై భారీ అంచనాలు ఉన్న నందమూరి ఫ్యాన్స్, ఎన్టీఆర్ తరవాత మోక్షజ్ఞే తదుపరి పాన్ ఇండియా స్టార్‌గా నిలుస్తారని భావిస్తున్నారు.
బాబీ వ్యాఖ్యలతో మోక్షజ్ఞ ఎంట్రీపై కొత్త చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే, బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ సినిమాపై కూడా మంచి హైప్ ఉంది.
సంక్రాంతి సందర్భంగా విడుదలకానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవాలని ఆశలు పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా బాబీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.