కేరళ: మాలీవుడ్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలతో కలకలం
మలయాళ చిత్ర పరిశ్రమ (మాలీవుడ్) ఇప్పుడు తీవ్ర దుస్థితిని ఎదుర్కొంటోంది. లైంగిక వేధింపుల ఆరోపణలతో మాలీవుడ్‌ను కుదిపేసింది. ఇప్పటి వరకు 17 కేసులు నమోదయ్యాయి.
ఈ ఆరోపణలు తీవ్ర రూపం దాల్చడంతో, మలయాళ సినీ నటీనటుల సంఘం అమ్మా (AMMA) రద్దు చేయడం కూడా జరిగింది. కేసుల అన్వేషణలో భాగంగా పలువురు ప్రముఖ సినీ నటులు, నిర్మాతలు, దర్శకులను పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉంది.
తాజాగా, ప్రముఖ సినీ నటి సోనియా మల్హర్ తనపై 2013లో సినిమా సెట్స్‌లో ఓ నటుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఆమె కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ముందు తన ఫిర్యాదును నమోదు చేయగా, విచారణ వేగవంతం అయ్యింది.
సోనియా మల్హర్ కంటే ముందుగా, మరో ప్రముఖ నటి మీను మునీర్ కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ, తనకు బెదిరింపు సందేశాలు వస్తున్నాయని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఈ నేపథ్యంలో SIT, మీను మునీర్ వాంగ్మూలాన్ని కూడా త్వరలో నమోదు చేసే అవకాశం ఉంది.
ఇక, ప్రముఖ మలయాళ సినీ నటుడు సిద్ధిఖీపై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.
2016లో ఓ సినీ నటి అతనిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేయగా, ఐపీసీ సెక్షన్ 376, 506 కింద పోలీసులు కేసు దాఖలు చేశారు. ఇది సిద్ధిఖీపై నమోదైన రెండో కేసు.
ఈ కేసులు మలయాళ చిత్ర పరిశ్రమలో పెరుగుతున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై తీవ్రంగా ఆలోచించేలా చేస్తున్నాయి.
అంతేకాక, జస్టిస్ హేమ కమిటీ నివేదిక ఇటీవల వెలుగులోకి రావడంతో, మలయాళ చిత్ర పరిశ్రమలోని కొంతమంది ప్రముఖులపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి.
235 పేజీల నివేదిక ప్రకారం, మాలీవుడ్‌ను 10-15 మంది పురుష నిర్మాతలు, దర్శకులు, నటీనటులు నియంత్రిస్తున్నారని పేర్కొంది.
ఈ నివేదికను 2017లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ 2019లో సమర్పించింది. అయితే, న్యాయపరమైన సవాళ్ల కారణంగా ఇప్పటివరకు నివేదిక బహిరంగంగా ప్రాచుర్యం పొందలేదు.