టాలీవుడ్: లాక్ డౌన్ సమయం లో ఓటీటీ లు ఊపందుకుంటున్న వేల కొత్త సినిమాలు లేని సమయంలో, తెలుగు లో కొత్తగా మొదలు పెట్టిన ఆహా ఓటీటీ వేరే బాషా సినిమాలని తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తుంది. అందులో ముఖ్యంగా చాలా మలయాళం సినిమాలని తెలుగులో విడుదల చేసింది. వీటికి ఆదరణ కూడా పెరుగుతుండడం తో ఆహా వాళ్ళు మరిన్ని మలయాళం సినిమాలని డబ్ చేయడానికి అడుగులు వేస్తున్నారు.
మలయాళం సినిమాలని తెలుగు లో చూస్తూ ఆ హీరోలకి ఇక్కడ కూడా గుర్తింపు లభిస్తుంది. ఇదివరకే డుల్కర్ కి ఇక్కడ మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇపుడు ఆహా విడుదల చేస్తున్న సినిమాల ద్వారా టొవినో థామస్ చాలా పాపులర్ అయ్యాడు. ఆహా విడుదల చేసిన మలయాళం సినిమాల్లో టొవినో థామస్ సినిమాలే ఎక్కువ. కొద్దీ రోజుల తర్వాత టొవినో థామస్ కి తెలుగు లో కూడా అవకాశాలు రావచ్చు.
టొవినో థామస్ తర్వాత ఫాహద్ ఆహా ద్వారా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫాహద్ నటించిన ‘ట్రాన్స్’ మూవీ లో ఫాహద్ నటనకి తెలుగులో కూడా మంచి గుర్తింపు లభించింది. ఈ మధ్యనే ఫాహద్ నటించిన ‘అనుకోని అతిధి’ సినిమా కూడా మంచి వ్యూస్ దక్కించుకుంది. ఫాహద్ ఆల్రడీ పుష్ప సినిమాలో విలన్ గా తెలుగులో నటించనున్నాడు. ఇంకా నివిన్ పాలీ మరియు మరి కొందరు నటులు ఈ డబ్ సినిమాల ద్వారా ఇక్కడ కూడా గుర్తింపు తెచ్చుకుని త్వరలో డైరెక్ట్ తెలుగు సినిమాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా మళయాళం హీరోలకి తెలుగులో మార్కెట్ ఏర్పడేలా ‘ఆహా‘ ఓటీటీ ఒక వారధి లాగా ఏర్పడి అక్కడి హీరోలకి బూస్టింగ్ ఇస్తుంది.