టాలీవుడ్: అక్కినేని అఖిల్ తన నాలుగవ ప్రయత్నంగా రూపొందుతున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్’. టాలీవుడ్ సక్సెస్ఫుల్ హీరోయిన్ ‘పూజ హెగ్డే‘ జోడీ గా ఈ సినిమా రూపొందుతుంది. విజయ దశమి సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన టీజర్ ఇవాళ విడుదల చేసారు. టీజర్ ఆద్యంతం వినోదాత్మకంగా ఆకట్టుకుంది. పెళ్లి కావాల్సిన అబ్బాయి రొటీన్ అమ్మాయి కాకుండా ఒక కొత్త రకమైన ఆలోచనలు ఉండే అమ్మాయిని కోరుకుంటాడు. అలంటి ఒక అబ్బాయి ప్రయాణం ఎటు సాగుతుంది, తనకి వచ్చే ప్రేయసి ఎలా ఉంటుంది. టూకీ గా చెప్పాలంటే టీజర్ ని బట్టి చూస్తే ఇది అర్ధం అవుతుంది. అర్బన్ ప్రేమకథ గా ఈ సినిమా రూపొందుతుంది.
చాలా రోజుల తర్వాత దర్శకత్వం వహిస్తున్న ‘బొమ్మరిల్లు భాస్కర్‘ ఈ సినిమా ద్వారా మళ్ళీ హిట్ ట్రాక్ పట్టడానికోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే తన స్ట్రాంగ్ పార్ట్ అయిన లవ్ అండ్ ఫామిలీ కథని ఎంచుకున్నాడు. GA2 పిక్చర్స్ ద్వారా అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. గోపి సుందర్ సంగీతం తో రాబోతున్న ఈ సినిమానుండి ఇప్పటికే విడుదలైన మనసా మనసా పాట ఆకట్టుకుంది. దాదాపు షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా ఈ సంవత్సరం క్రిస్టమస్ లేదా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల అయ్యే ప్లాన్ లో ఉంది.