టాలీవుడ్: 2020 సంవత్సరం తో మొదటి మూడు నెలలు మినహా మిగతా సంవత్సరం మొత్తం కరోనాతో తుడిచిపెట్టుకుపోయింది. చివర్లో డిసెంబర్ లో ఒకటి రెండు సినిమాలు కొస మెరుపులాగా 2021 సంవత్సరాన్ని ఆరంభించడానికి నూతనుత్తేజాన్ని అందించాయి. 2021 సంవత్సరం ఆరంభం నుండి ప్రతి వారం మూడు సినిమాలకి తగ్గకుండా సినిమాలు విడుదలవుతున్నాయి. విడుదలవుతున్న సినిమాల్లో కూడా మంచి టాక్ వచ్చిన సినిమాలు కొన్ని బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అసలు కంటెంట్ లేకుంటే మాత్రం రెండవ రోజు నుండే థియేటర్లు ఖాళీ గా కనిపిస్తున్నాయి.
ఈ వారం కూడా సౌత్ లోని మూడు ఇండస్ట్రీస్ నుండి మూడు సినిమాలు విడులవుతున్నాయి. తెలుగులో ఈ వారం కేవలం ఒక్క సినిమానే కాంపిటీషన్ లేకుండా విడుదలవుతుంది. సీనియర్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా ఒక ఇన్వెస్టిగేషన్ జానర్ లో ‘వైల్డ్ డాగ్‘ అనే సినిమా రేపు విడుదలవుతుంది. ఈ సినిమా టీజర్ ట్రైలర్ ఇలా అన్ని రకాలుగా పాజిటివ్ టాక్ తో అంతే కాకుండా ప్రివ్యూ చూసిన సినిమా పెద్దలు ఇచ్చిన మంచి ఫీడ్ బ్యాక్ తో ఈ సినిమాకి మొత్తం పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి.
తమిళ్ లో కార్తీ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘సుల్తాన్’ తెలుగులో కూడా అదే పేరుతో డబ్ అయి రేపు విడుదలవుతుంది.ఈ సినిమాలో రష్మిక మందన్న ఒక పూర్తి విలేజ్ అమ్మాయి పాత్రలో కనపడుతుంది. ఈ సినిమాతో రష్మిక తమిళ ఇండస్ట్రీ కి పరిచయం అవుతుంది. ఈ సినిమాలో కార్తీ యాక్షన్ సీన్స్, అలాగే కార్తీ మరియు రష్మిక మధ్య ఉండే లవ్ అండ్ టీజింగ్ సీన్స్ ఆకట్టుకుంటాయని సినిమా టీం ప్రచారం చేసింది. రెమో డైరెక్టర్ భాగ్యరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎలా ఆకట్టుకోబోతుందో రేపు తెలుస్తుంది.
ఇదే కాకుండా కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా , సాయేషా హీరోయిన్ గా థమన్ సంగీతంలో ‘యువరత్న’ అనే సినిమా ఈ రోజు తెలుగులో కూడా డబ్ అయింది. పునీత్ మొదటి సారి ఈ సినిమాతో తెలుగులో కూడా తన మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా ఈ వారం మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తమ లక్ ని పరీక్షించుకోబోతున్నాయి.