టాలీవుడ్: ప్రతీ వారం థియేటర్లలో సినిమాలు విడుదల అవుతాయి. ఇపుడు ఉన్న పరిస్థితుల్లో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడం తో కొన్ని కొత్త సినిమాలు , కొన్ని ఇదివరకే విడుదలైన సినిమాలు ఓటీటీ లో స్ట్రీమ్ చేయబోతున్నారు. ఈ శుక్రవారం రంజాన్ పండగ వలన లాంగ్ వీకెండ్ అవడంతో కొన్ని సినిమాలు ఈ వారం లో ఓటీటీ లో అందుబాటులో ఉంచనున్నారు. మామూలుగా ఈ టైం లో కొన్ని పెద్ద సినిమాలు విడుదల అయ్యేవి కానీ పరిస్థితి ఇంట్లో కూర్చొని చూడాల్సి వస్తుంది.
ఈ రోజు నుండి సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే’ సినిమా జీ సినీ ప్లెక్స్ ఓటీటీ లో అందుబాటులో ఉంది. ఈ సినిమాని ఈరోజు నుండి థియేటర్లు మరియు ఓటీటీ లో ఒకేసారి విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు కానీ దాదాపు దేశం మొత్తం లాక్ డౌన్ ఉండడం తో ఈ సినిమా కేవలం ఓవర్ సీస్ లోనే థియేటర్లలో విడుదలైంది.
బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు ద్వయం రాజ్ & డీకే నిర్మాతలుగా ‘సినిమా బండి’ అనే చిన్న సినిమా రూపొందింది. ఈ సినిమా నెట్ ఫ్లిక్ ఓటీటీ కోసం రూపొందించారు. ఈ సినిమా రేపటి నుండి నెట్ ఫ్లిక్ లో అందుబాటులో ఉండనుంది. అసలు కెమెరా అంటే ఏంటి, ఎలా ఆపరేట్ చెయ్యాలో తెలియని పల్లెటూరి వాళ్ళు వాళ్ళకి దొరికిన కెమెరా తో సినిమా చేయడానికి పూనుకొని, ఎన్ని ఇబ్బందులు పడి సినిమా తీశారు అని మంచి హ్యూమరస్ టచ్ తో ఈ సినిమా రూపొందించారు మేకర్స్.
వివాదాల డైరెక్టర్ ‘రామ్ గోపాల్ వర్మ’ డైరెక్ట్ చేసిన ‘D కంపెనీ’ రేపటి నుండి స్పార్క్ ఓటీటీ లో అందుబాటులో ఉండనుంది. డాన్ కథలు బాగా తియ్యగలిగిన వర్మ ‘దావూద్ ఇబ్రహీం’ కథ ఆధారంగా ఈ సినిమాని రూపొందించాడు. లాక్ డౌన్ తర్వాత తమిళ్ లో థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా ‘కర్ణన్’. ఈ సినిమాలో ధనూష్ నటనకి మంచి పేరు వచ్చింది. ఈ సినిమా రేపటినుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటులో ఉండనుంది. నితిన్ హీరోగా చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన ‘చెక్’ సినిమా రేపటి నుండి సన్ నెక్స్ట్ ఓటీటీ లో స్ట్రీమ్ అవనుంది. మరొక హాలీవుడ్ సూపర్ హీరో మూవీ ‘వండర్ ఉమెన్ 1984’ మే 15 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవనుంది.