టాలీవుడ్: పోయిన సంవత్సరం మొత్తం కరోనా కారణంగా థియేటర్లు, షూటింగ్ లకి అవకాశం లేకుండా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. దీనితో చాలా మంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోవడం తో పాటు ఆధారం లేకుండా పోయారు. అయితే కరోనా ఇక మన లైఫ్ స్టైల్ లో భాగం అని , సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తూ షూటింగ్ మొదలుపెట్టిన సినిమా టీమ్స్ ఎడతెరపి లేకుండా షూటింగ్లు జరుపుకుంటున్నాయి. కమిట్ అయిన ప్రోజెక్టులని ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న టైం కి పూర్తి చేయడానికి హీరోలు కూడా కష్టపడుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్ళీ షూటింగ్ లకి గ్యాప్ వచ్చింది. కొందరు హీరోలు వాల్ల టీం లో కరోనా లక్షణాలు ఉండడం తో షూట్ గ్యాప్ ఇచ్చారు. మరి కొందరు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ జరుపుతున్నారు.
సెకండ్ వేవ్ కారణంగా నైట్ లాక్ డౌన్ విధించినా కూడా రామోజీ ఫిలిం సిటీ లో షూట్ జరుపుకుంటున్న రజిని కాంత్ ‘అన్నాతి’ మూవీ స్పెషల్ పెర్మిషన్ తీసుకుని మరి షూటింగ్ జరుపుకుంటుంది. మరో టాప్ హీరో బాలకృష్ణ ‘అఖండ’ సినిమా షూట్ ముగించే పనిలో ఉన్నాడు. కరోనా ని లెక్క చేయకుండా ఈ సినిమాని అనుకున్న టైం కి పూర్తి చేయడమే లక్ష్యంగా షూట్ చేస్తున్నాడు.
నాచురల్ స్టార్ నాని టాక్ జగదీశ్ సినిమాని విడులకి సిద్ధం చేసి మరో రెండు సినిమా షూట్ లలో బిజీ గా ఉన్నాడు. ‘శ్యామ్ సింఘరాయ్’ కోసం చాలా రోజుల నుండి షూట్ చేస్తున్న ఈ హీరో ఈ మధ్యనే ‘అంటే సుందరానికి’ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టాడు. అల్లు అర్జున్ పుష్ప కూడా ఎడతెరపి లేకుండా షూట్ జరుపుకుంటుంది. ఈ మధ్యనే విలన్ ఫాహద్ కూడ లో షూట్ లో జాయిన్ అయ్యాడు. మరో హీరో నాగ చైతన్య తన హిట్ డైరెక్టర్ ‘విక్రమ్ కె కుమార్’ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘థాంక్ యు’ సినిమా కోసం బాగానే కష్టపడుతున్నాడు. ఈ మధ్యనే ఒక షెడ్యూల్ ముగించుకున్న ఈ సినిమా టీం ఇటలీ లో మరో షెడ్యూల్ జరుపుకుంటుంది. ఇలా హీరోలందరూ కరోనాని తమ లైఫ్ లో ఒక భాగంగా ఫీల్ అవుతూ తగిన జాగ్రత్తలు తీసుకుని షూటింగ్స్ పూర్తి చేస్తున్నారు.