టాలీవుడ్: కరోనా కారణంగా థియేటర్లు మొదలుకొని షూటింగ్ పనులు కూడా ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. సెకండ్ వేవ్ తగ్గుముఖం పడడం తో అందరూ వ్యాక్సినేషన్ వేయించుకుని షూటింగ్ మొదలు పెట్టే ఆలోచనల్లో ఉన్నారు. కొందరు ఆల్రెడీ షూటింగ్ మొదలు పెట్టారు. ఇంకొందరు ఇపుడిపుడే మొదలు పెడుతున్నారు. చూస్తుంటే నెల చివరి వరకు దాదాపు అన్ని షూటింగ్స్ పునః ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
నితిన్ నటిస్తున్న ‘అందాదున్’ రీ-మేక్ ‘మేస్ట్రో’ మూవీ షూటింగ్ ఈరోజే మొదలైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ ఈ రోజు మొదలైంది. ఈ సంవత్సరంలో ఇప్పటికి రెండు సినిమాలు పూర్తి చేసిన నితిన్ ఈ సినిమా పూర్తి చేసి జులై లో విడుదల చేయాలనీ చూస్తున్నాడు. నాని నిర్మాణంలో ‘మీట్ క్యూట్’ అనే సినిమా ఈ రోజే షూటింగ్ మొదలైంది.
విశాల్ నటిస్తున్న ‘నాట్ ఎ కామన్ మాన్’ అనే సినిమా కూడా హైదరాబాద్ లో షూటింగ్ మొదలు పెట్టింది. ఈ సినిమా కూడా 30 రోజుల్లో పూర్తి చేయాలనీ ద్యేయంతో టీం పని చేస్తున్నారు. నిఖిల్ నటిస్తున్న ’18 పేజెస్’ సినిమా కూడా ఈ మధ్యనే షూటింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టింది. ఇలా ఒక దాని తర్వాత ఒకటి దాదాపు అన్ని సినిమాలు షూటింగ్ కారక్రమాలు మొదలు పెడుతున్నాయి. ఇప్పటికే ఒక షో తో వైజాగ్ లో థియేటర్ లు మొదలు పెట్టారు. ఈ లిస్ట్ లో వకీల్ సాబ్ మరియు క్రాక్ సినిమాలతో కొన్ని థియేటర్లు ఇంకొన్ని ఏరియాల్లో ప్రారంభం అవనున్నాయి. చూస్తుంటే జులై మొదటి వారంలో థియేటర్లలో కొత్త సినిమాల సందడి మొదలయ్యే సూచనలు ఉన్నాయి.