హైదరాబాద్: కరోనా వచ్చి అయిదు నుండి ఆరు నెలలు థియేటర్ లు లేక, షూటింగ్ లు లేక, సినిమాలు లేక టాలీవుడ్ మొత్తం బోసిపోయింది. అయితే పరిస్థితిని అర్ధం చేసుకున్న హీరోలు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మెల్లగా ఒకరి తర్వాత ఒకరు కదిలారు. ఇండస్ట్రీ లో మొదలు నాగార్జున బిగ్ బాస్ అలాగే వైల్డ్ డాగ్ షూటింగ్ మొదలు పెట్టాడు. తర్వాత సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ షూటింగ్ పూర్తి చేసాడు. అయితే మొదట్లో షూటింగ్స్ తిరిగి ప్రారంభం అయినవి తక్కువే అనుకున్నారు. కానీ సెప్టెంబర్ చివరి వారం అక్టోబర్ వచ్చేసరికి దాదాపు 80 శాతం సినిమాలు షూటింగ్ మళ్ళీ ప్రారంభించాయి.
నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్’, నాని ‘టాక్ జగదీశ్’, సుశాంత్ ‘ఇచట వాహనములు నిలుపరాదు’, శ్రీ విష్ణు ‘రాజ రాజ చోళ’, మంచు విష్ణు ‘మోసగాళ్ళు’, రాజమౌళి ‘RRR ‘, ప్రభాస్ ‘రాధే శ్యామ్’, రవి తేజ ‘క్రాక్’ , మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ , నితిన్ ‘రంగ్ దే’, విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ ఇలా అక్టోబర్ కి వచ్చేసరికి దాదాపు అన్ని షూటింగ్ లు జోరు మీద కొనసాగుతున్నాయి. ఇక మిగిలింది చిరంజీవి ‘ఆచార్య’, వెంకీ ‘నారప్ప’, బాలయ్య బోయపాటి సినిమాలు పునః ప్రారంభించడమే తరువాయి. ఇలా హీరోలు అందరూ షూటింగ్ లు ముంగించేసి సినిమాలు సిద్ధం చేసే పనిలో పడ్డారు.