మూవీడెస్క్: ప్రముఖ దర్శకుడు సందీప్ రాజ్ రెండవ ప్రాజెక్ట్ మోగ్లీ 2025 పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది.
అర్జున్ రెడ్డి వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన సందీప్ రెడ్డి వంగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై తొలి క్లాప్ కొట్టడం విశేషం.
యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల, నూతన నటీమణి సాక్షి సాగర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ సందీప్ రాజ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నారు.
మొదటి సినిమా కలర్ ఫోటో ద్వారా విమర్శకుల ప్రశంసలు పొందిన ఆయన, మోగ్లీ 2025 తో మరోసారి తన మార్క్ చూపించడానికి సిద్ధమయ్యారు.
రోషన్ తన లుక్‌లో కొత్తదనంతో ఆకట్టుకుంటున్నాడు, అయితే సాక్షి తొలిసారి వెండితెరపై మెరవనుంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తున్నారు.
కెమెరామెన్ రామమారుతి మోహన్ సాంకేతికంగా సినిమాను మరింత ఎలివేట్ చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఈ సినిమా యూత్‌ని ప్రధానంగా ఆకట్టుకునే ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది.
రోషన్, సాక్షి జంటగా రూపొందుతున్న ఈ చిత్రం పెద్ద స్థాయి ప్రేక్షకాదరణ పొందుతుందనే ఆశతో చిత్రబృందం ముందుకు సాగుతోంది.
టీజర్, ట్రైలర్ వేడి పెంచేలా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.