టాలీవుడ్: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒకప్పుడు సంక్రాంతి రాజు గా పేరు తెచ్చుకున్న ప్రొడ్యూసర్ ఎం ఎస్ రాజు. వర్షం, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ సినిమాలని అందించిన నిర్మాత ఆ తర్వాత కొన్ని సినిమాలు తీసినా కూడా అంతగా ఆడలేదు. దర్శకుడిగా కూడా ఒక రెండు సినిమాలు తీసాడు కానీ అవి కూడా అంతగా విజయవంతం అవలేదు. ఆ తర్వాత చాలా రోజులు సినిమాల వంక చూడుఅలేదు. ఇపుడు మరోసారి ‘డర్టీ హరి’ అనే సినిమాతో దర్శకుడిగా మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ఇవాల విడుదలైంది.
ఈ సినిమాకి సంబందించిన టీజర్, ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ఇదొక అడల్ట్ సినిమా అన్నట్టుగా అనిపించాయి, కానీ ఇవాల విడుదలైన ట్రైలర్ చూస్తే ఇదొక రొమాంటిక్ క్రైం థ్రిల్లర్ అనిపించింది. ముందుగా విడుదల చేసిన టీజర్ లో ఎక్కువగా అడల్ట్ కంటెంట్ పైన ఫోకస్ చేసి కట్ చేసినట్టు అనిపించింది. ట్రైలర్ చూస్తే ఒరిజినల్ కంటెంట్ ఏంటి అనేది అర్ధం అవుతుంది. బాలీవుడ్ లో వచ్చిన రాగిణి, హేట్ స్టోరీ లాంటి సినిమాలు ఇదే క్యాటగిరీ లోకి వస్తాయి. ఎం ఎస్ రాజు కూడా అదే ఫార్ములా ని ఫాలో అయినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో శ్రవణ్ రెడ్డి హీరో గా నటిస్తున్నాడు. చి ల సౌ సినిమా ద్వారా ఆకట్టుకున్న రుహాణి శర్మ హీరోయిన్ గా ఈ సినిమాలో నటిస్తుంది. గూడూరు శివ రామకృష్ణ సమర్పణలో సతీష్ బాబు,సాయి పునీత్ ఈ సినిమాని నిర్మించాడు. డిసెంబర్ 18 న ఈ సినిమా ‘ఫ్రైడే మూవీస్’ కొత్త డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో విడుదల అవుతుంది.