fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsముగ్గురు మొనగాళ్లు ఫస్ట్ లుక్

ముగ్గురు మొనగాళ్లు ఫస్ట్ లుక్

MugguruMonagaallu Movie FirstLook

టాలీవుడ్: ముగ్గురు మొనగాళ్లు అనగానే మెగా స్టార్ త్రిపాత్రాభినయం లో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొందిన సినిమా గుర్తుకువస్తుంది. ప్రస్తుతం అదే టైటిల్ తో మరో సినిమా రూపొందుతుంది. ఈరోజు ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. కమెడియన్ గా చాలా సినిమాలు చేసిన శ్రీనివాస్ రెడ్డి హీరోగా అప్పుడప్పుడు తళుక్కుమంటున్నాడు. ఈ సినిమాలో కూడా శ్రీనివాస్ రెడ్డి మరో ఇద్దరు హీరోలతో పాటు హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే హీరోగా ‘జయమ్ము నిశ్చయమ్మురా’, ‘గీతాంజలి’, ‘జంబలకిడి పంబ’ లాంటి సినిమాల్లో మెప్పించిన శ్రీనివాస్ రెడ్డి మరోసారి హీరో పాత్రలో ఈ సినిమాలో నటిస్తున్నాడు.

అభిలాష్ రెడ్డి అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు. గాంధీ గారి మూడు కోతుల్లాగా కళ్ళు, ముక్కు, చెవులు మూసుకున్నట్టుగా ఉన్న ఫస్ట్ లుక్ ఈరోజు విడుదల చేసారు. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి, రామారావు మరో రెండు పాత్రల్లో నటిస్తున్నారు. పూర్తి కామెడీ నేపథ్యం లో ఈ సినిమా రూపొందనుంది. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. చిత్ర మందిర్ స్టూడియో మరియు మధుర ఆడియో సమర్పణలో పి. అచ్చుత రామారావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల వివరాలు మరి కొద్దీ రోజుల్లో తెలియచేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular