న్యూఢిల్లీ: ఇంకో వారం రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధర 4జీ ఫోన్ ‘జియో ఫోన్ నెక్ట్స్’ విడుదల కాబోతోంది. జియో- గూగుల్ సంయుక్తంగా రూరల్ ఏరియాల్ని టార్గెట్ చేస్తూ విడుదల చేయనుంది. ఈ ఫోన్ ధర, ఫీచర్స్ గురించి తెలుసుకునేందుకు ఇప్పటికే చాలా మంది ఆసక‍్తి చూపిస్తున్నారు.
కాగా అందరి ఆసక్తిని రెండింతలు చేస్తూ అతి తక్కువ డౌన్ పేమెంట్ రూ. 1999/- కట్టి మిగతాది కేవలం రూ.300 నెలవారీ ఈఎంఐని చెల్లించి ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. దీపావళి సందర్భంగా విడుదల అవనున్న ఈ ఫోన్ ఈఐఎంఐతో పాటు వాయిస్ కాల్స్, డేటా వివరాల గురించి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అధికారికంగా ఇవాళ వెల్లడించారు.
భారత్‌లో విడుదల అవనున్న రిలయన్స్ 4జీ జియో ఫోన్ నెక్ట్స్‌ను జియో సంస్థ కేవలం రూ.1,999 చెల్లించి సొంతం చేసుకోవచ్చు అని కంపెనీ ప్రకటించింది. మిగతా మొత్తాన్ని కస్టమర్లు 18 నెలలు లేదంటే 24 నెలల కాల వ్యవధిలో ఈఎమై గా చెల్లించే సౌకర్యాన్ని కూడా రిలయన్స్ జియో అందిస్తుంది.
అయితే ఇటీవల చిప్ సెట్‌ల కొరత వల్ల భారత్‌లో కాస్త ఎక్కువ ధరకే జియో ఫోన్ విడుదల కానుంది. మన దేశంలో జియో ఫోన్ ధర రూ.6,499గా నిర్ణయించింది. కాగా, కస్టమర్లు బడ్జెట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలంటే రూ.1,999 ను డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని 18-24 నెలల్లోగా తిరిగి చెల్లించే అవకాశం కల్పించింది. ఇందుకోసం జియో నాలుగు ప్లాన్‌లను అందుబాటులోకి కూడా తెచ్చింది.