టాలీవుడ్: ఆర్జీవీ మిస్సింగ్ అనే పేరుతో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ నుండి సెకండ్ లుక్ అని థర్డ్ లుక్ అని ఇలా ఇప్పటి వరకు సిక్స్ లుక్స్ విడుదల అయ్యాయి. ఒక్కో లుక్ లో ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ వదిలారు. ఒక అమాయకమైన వ్యక్తి ఆర్జీవీ కిడ్నాప్ అయ్యాడని అనుమానితులు అంటూ ఒక్కొక్కరికి ఒక్కో లుక్ విడుదల చేసారు.
సెకండ్ లుక్ అంటూ ప్రైమరీ సస్పెక్ట్ పీకే అని పవన్ కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని టచ్ చేసాడు. తర్వాత థర్డ్ లుక్ అని సెకండరీ సస్పెక్ట్ అని చిరంజీవిని టార్గెట్ చేసాడు. ఆ తర్వాత ఫోర్త్ లుక్ అని అందులో తండ్రి కొడుకుల పాత్రలతో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అలాగే అతని కుమారుడు లోకేష్ ని టార్గెట్ చేసాడు. ఫిఫ్త్ లుక్ అని ‘గజినీ కాంత్’ అనే పేరుతో రజిని కాంత్ ని టార్గెట్ చేసాడు. ఆర్జీవీ మిస్సింగ్ కేసును డీల్ చేసే పోలీస్ ఆఫీసర్ రోల్ లో ఈ గజినీ కాంత్ కనిపించబోతున్నాడు. ఇవాళ ఇంటర్నేషనల్ జోకర్ అని కే ఏ పాల్ ని టార్గెట్ చేస్తూ సిక్స్త్ లుక్ విడుదల చేసాడు. ఇంకా ఎన్ని లుక్ లు విడుదల చేస్తాడో అనేది ముందు ముందు తెలుస్తుంది.
లాక్ డౌన్ లో విడుదల చేసిన సినిమాల్లాగే ఇది కూడా ఒక చిన్న సినిమాలాగే అనిపిస్తుంది. కంటెంట్ తక్కువ పబ్లిసిటీ , హంగామా ఎక్కువ ఉన్న సినిమాలు ఇవి. కంటెంట్ లేకుండా కాంట్రవర్సీ తో నెగ్గుకొస్తున్న ఆర్జీవీ ఈ సిరీస్ లలో ఇంకా ఎన్ని సినిమాలు తీస్తాడో.. వీటికి అడ్డుకట్ట ఎలా పడుతుందో అని సాధారణ సినిమా అభిమానులు అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తున్నారు.