ఒకప్పుడు ఐటెం సాంగ్స్‌లో అగ్రస్థానం దక్కించుకున్న ముమైత్ ఖాన్, గత కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో తన డ్యాన్స్‌తో మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నా, కొంతకాలంగా ఆమె గురించి పెద్దగా వార్తలు రాలేదు. తాజాగా, ముమైత్ ఖాన్ తన జీవితంలో జరిగిన ఓ షాకింగ్ సంఘటనను బయటపెట్టింది.
“ఇంట్లో డ్యాన్స్ చేస్తూ కాలు జారి బెడ్‌కి తల బలంగా తగిలింది. రక్తం కనిపించలేదు కానీ లోపల పెద్ద గాయం అయింది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లగా, మెదడులో మూడు నరాలు పూర్తిగా కట్ అయ్యాయని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ తర్వాత 15 రోజుల పాటు కోమాలో ఉండాల్సి వచ్చింది” అని ఆమె చెప్పింది.
అంతే కాదు, కోమా నుంచి బయటకొచ్చిన తర్వాత తన మెమరీ లాస్‌కు గురైందని పేర్కొంది. కొంతకాలం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేకపోయిందట. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న ముమైత్, మళ్లీ కెరీర్‌పై దృష్టి పెట్టేందుకు సిద్ధమవుతోంది.
ఇప్పటివరకు స్పెషల్ సాంగ్స్‌తో పాటు ప్రధాన పాత్రల్లో కూడా కనిపించిన ముమైత్, మరోసారి టాలీవుడ్‌లో అడుగుపెడుతుందా? అన్నది ఆసక్తిగా మారింది. ఆమె తాజా వ్యాఖ్యలు అభిమానుల్లో ఉత్కంఠను పెంచాయి.