ముంబై ఇండియన్స్: ముంబై ఇండియన్స్, ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన టీం. ఇంతవరకు జరిగిన అన్ని ఐపీఎల్ మ్యాచ్ లో అత్యధిక సార్లు కప్ గెలుచుకున్న టీం.
అలాగే రోహిత్ శర్మ అంటే ఐపీఎల్ లో అత్యంత విజయంతమైన కెప్టెన్ గా పేరుంది. ఆడిన ప్రతి సీజన్ లోనూ అద్భుతంగా ఆడడం వారికి అలవాటు. ప్రత్యర్థి ఎవరైనా వారిని చిత్తు చేయడమే ముంబై కి అలవాటు.
ఇది అంతా ఒకప్పటి మాట. ఇప్పుడు ఐపీఎల్ 2022లో ఆ టీం కు ఏమైంది అనే ప్రశ్న యావత్ ముంబై ఇండియన్స్ అభిమానులను మరియు క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. ఇప్పటి వరకు ఐపీఎల్ 2022లో 5 మ్యాచ్లు ఆడగా అన్నింటిలోనూ ఓడిపోయి పాయింట్స్ టేబుల్ లో చిట్ట చివరి స్థానంలో కొనసాగుతోంది.
మరి ఈ రోజు లక్నోతో జరగనున్న తమ 6వ మ్యాచ్లోనైనా ముంబై విజయాన్ని నమోదు చేస్తుందా లేద అనేది ఇవాళ సాయంత్రం వరకు వేచి చూడాలి.