ముంబై: ఐపీఎల్ లో సక్సెస్ ఫుల్ టీం అంటే వచ్చే తొలి పేరు ముంబై ఇండియన్స్! ఈ టీం ఐదు సార్లు ఛాంపియన్స్‌గా నిలిచి ఈ సారి ఐపీఎల్-2022లో మాత్రం పూర్తిగా నిరాశపరిచింది.
ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ ఒకే ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇప్పటి వరకు ప్లేఆఫ్స్ కు మొదటగా వెల్లే ముంబై ఈ సారి మాత్రం ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి టీం అయ్యింది.
ఈ నేపథ్యంలో ఇక మిగిలి ఉన్న మ్యాచ్‌ల్లో బెంచ్‌లో ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత సీజన్‌లో ముంబై కథ ముగిసింది.