హైదరాబాద్: దేశంలో కరోనా 2వ దశలో విలయ తాండవం సృష్టిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. చాలా రాష్ట్రాలు లాక్డౌన్, కర్ఫ్యూ వంటి వ్యూహాలు రచిస్తూ వెళ్తున్నాయి. కానీ ఎన్నికలకు కొత్త నొటిఫికేషన్లు మాత్రం వస్తూనే ఉన్నాయి.
తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది ఎలక్షన్ కమీషన్. రాష్ట్రంలో రెండు కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా, 16వ తేదీ నుంచి ఈ నెల 18 వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగనుండగా, ఉపసంహరణకు 22వ తేదీన తుది గడువు విధించారు.
ఈ పోలింగ్ కు ఎన్నికలు ఏప్రిల్ 30వ తేదీన జరుగనున్నాయి. మే 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేయనున్నారు. కాగా వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్ వివరాలు:
నామినేషన్ల స్వీకరణ: ఏప్రిల్ 16 నుంచి 18 వరకు, ఉపసంహరణకు చివరి తేదీ: ఏప్రిల్ 22, పోలింగ్ తేదీ: ఏప్రిల్ 30, కౌంటింగ్: మే 3వ తేదీన జరుగుతాయి.