అంతర్జాతీయం: ఓపెన్ ఏఐని కొనేస్తానన్న మస్క్ – దీటుగా బదులిచ్చిన ఆల్ట్‌మన్
భారీ ఆఫర్‌తో మస్క్ – వ్యంగ్యంగా ఆల్ట్‌మన్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) తన దృష్టిని ఓపెన్ ఏఐ (OpenAI) పై సారించారు. ఆ సంస్థను 97.4 బిలియన్ డాలర్ల (సుమారు ₹8.5 లక్షల కోట్లు)కు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు. అయితే, దీనికి ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) వ్యంగ్యంగా స్పందించారు. ఆయన “మీ ఆఫర్ వద్దు.. అయితే మేమే మీ ఎక్స్ (Twitter)ని 9.74 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయగలం” అంటూ సమాధానం ఇచ్చారు.
ఓపెన్ ఏఐ – మస్క్ మధ్య విభేదాలు
2015లో స్థాపించిన ఓపెన్ ఏఐ కి మస్క్ పెట్టుబడి పెట్టినా, 2018లో ఆ సంస్థ నుంచి వైదొలిగారు. ఆ తర్వాత 2019లో మైక్రోసాఫ్ట్ 14 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి, ఓపెన్ ఏఐతో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. దీనిపై మస్క్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో కేసు వేశారు.
లాభాపేక్ష
ఓపెన్ ఏఐ (OpenAI)ని 97.4 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.8.5లక్షల కోట్లు)కు కొనుగోలు చేస్తామంటూ మస్క్, ఆయన ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ అధికారికంగా ప్రతిపాదించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది. ‘‘ఓపెన్ ఏఐని పూర్తిగా లాభాపేక్ష గల కంపెనీగా మార్చాలని శామ్ ఆల్ట్‌మన్, ఆయన బోర్డు కోరుకుంటే.. అందుకు మేం సిద్ధం. దానిపై నియంత్రణ వదులుకునేందుకు వారికి మా ఛారిటీ తగిన పరిహారం చెల్లిస్తుంది’’ మస్క్ న్యాయవాది చెప్పినట్లు ఆ కథనంలో ఉంది.
ఆల్ట్‌మన్ దీటైన కౌంటర్
ఈ వార్తలపై ఆల్ట్‌మన్ స్పందిస్తూ, మస్క్ ఆఫర్‌ను తిరస్కరించారు. అంతటితో ఆగకుండా, “మేమే మీ ట్విటర్‌ను అదే ధరకు కొనగలం” అంటూ మస్క్‌కు చురక అంటించారు.
మస్క్ స్పందన
ఆల్ట్‌మన్ వ్యాఖ్యలకు మస్క్ తీవ్ర స్థాయిలో స్పందించారు. “మోసగాడు” అంటూ ఆల్ట్‌మన్‌పై నేరుగా విమర్శలు చేశారు.
మస్క్-ఓపెన్‌ఏఐ వివాదం రానున్న రోజుల్లో మరింత ముదిరే అవకాశం
ఓపెన్ ఏఐపై మస్క్ కోర్టు కేసు వేసినప్పటి నుంచి, వారి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ కొత్త పరిణామంతో వివాదం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.