కోలీవుడ్: ఈ మధ్యనే శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ రూపొందిస్తున్నట్టు అందులో మురళీధరన్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు ‘విజయ్ సేతుపతి‘ నటించబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ఇవాళ ఈ సినిమాకి సంబందించిన మోషన్ పోస్టర్ కూడా ఒకటి విడుదల చేసారు. సినిమా టైటిల్ ‘800 ‘ ని క్రికెట్ బాల్ త్రెడ్స్ తో రూపొందించి బాల్ స్పిన్ట్ తిరిగినట్టు ఆ లెటర్స్ ని ఆరెంజ్ చేసి క్రియేటివిటీ ని చూపించారు. అలాగే మోషన్ పోస్టర్ లో విజయ్ సేతుపతి ని మురళీధరన్ లుక్ లో సరిగ్గా కుదిరాడని అనిపిస్తుంది. ఈ సినిమాని ‘మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్’, ‘దార్ మోషన్ పిక్చర్స్’ కలిసి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఎమ్.ఎస్. శ్రీపతి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ పోస్టర్ విడుదల చేస్తూ ‘మురళీధరన్ సక్సెస్ గురించి తెలుసు కానీ ఆయన శ్రమ గురించి ఆయన దాటుకుని వచ్చిన కష్టాల గురించి తెలియని విషయాలని చెప్పే ప్రయత్నం ఈ సినిమా’ అని మేకర్స్ తెలిపారు. గల్లీ క్రికెట్ నుండి శ్రీలంక లోని ‘గాలే‘ ఇంటర్నేషనల్ స్టేడియం లో ఇంటెర్నేషల్ క్రికెట్ ఆడే స్టేజి కి ఎలా చేరుకోగలిగాడే అనే ప్రయాణం ఈ సినిమా అని తెలుస్తుంది. మురళీధరన్ బాల్యం లో ఎదుర్కొన్న సంఘటనలు, స్పిన్నర్ గా ఒక వెలుగు వెలిగిన తర్వాత మురళీధరన్ బౌలింగ్ శైలి పై చేసిన పరీక్షలు, అలాగే పాకిస్తాన్ లో క్రికెట్ మ్యాచ్ ఆడుతుండగా ఉగ్రవాదులు జరిపిన కాల్పులు.. ఇలా కొన్ని సంఘటనలని మోషన్ పోస్టర్ లో చూపించారు. మోషన్ పోస్టర్ లో వచ్చే బాగ్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది.