మైత్రి హృతిక్ కాంబో?.. బాలీవుడ్‌లో మాస్ ప్లాన్!
పాన్ ఇండియా మార్కెట్లో దూసుకెళ్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు బాలీవుడ్‌ను కూడా తన మాస్ కథలతో షేక్ చేయాలని సిద్ధమవుతోంది. ఇప్పటికే ‘జాట్’ సినిమాతో హిందీ ఆడియెన్స్‌కి పరిచయం అవుతున్న మైత్రి.. ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది.
ఈసారి దర్శకుడిగా బాబీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ తరువాత బాబీ మాస్ డైరెక్టర్‌గా మంచి క్రేజ్ సంపాదించగా, తాజాగా హృతిక్ రోషన్‌కు ఓ పవర్‌ఫుల్ స్టోరీ లైన్ వినిపించినట్టు సమాచారం. హృతిక్ కథపై ఆసక్తిగా స్పందించాడని, బౌండెడ్ స్క్రిప్ట్ వచ్చిన తర్వాత ఫైనల్ నోడ్ ఇవ్వనున్నాడని టాక్.
ఇదే నిజమైతే, మైత్రి బాబీ హృతిక్ కాంబినేషన్ బాలీవుడ్‌లో భారీ బజ్ క్రియేట్ చేయడం ఖాయం. టెక్నికల్‌గా అగ్ర శ్రేణి బృందాన్ని తీసుకుని ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో రూపొందించాలనే ఉద్దేశంతో మైత్రి ముందుకు వెళ్తోంది.
ఇప్పటికే మైత్రి పుష్ప 2, విరూపాక్ష, సత్తా ఉన్న భారీ ప్రాజెక్ట్స్‌తో జాతీయ స్థాయిలో తన సత్తా చాటుతోంది. ఇప్పుడు హృతిక్‌తో భారీ సినిమా చేస్తే, బాలీవుడ్‌లో తమ స్థిరపాటును పెంచే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ త్వరలో వచ్చే అవకాశం ఉంది.