మూవీడెస్క్: టాలీవుడ్‌లో పెద్ద నిర్మాణ సంస్థగా పేరొందిన మైత్రి మూవీ మేకర్స్, ఇప్పుడు థియేటర్ బిజినెస్‌లో కూడా తమ స్థాయిని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
పాన్ ఇండియా స్థాయిలో ప్రాజెక్ట్‌లు చేయడం మాత్రమే కాకుండా, థియేటర్ నెట్వర్క్‌ను స్ట్రాంగ్ చేయాలని మైత్రి ప్రణాళికలు రచిస్తోంది.
ఇప్పటికే తెలంగాణలోని కొన్ని పాత థియేటర్లను రెనొవేషన్ చేసి, వాటిని నూతనంగా మార్చే పనిలో ఉంది.
హైదరాబాద్‌లోని విమల్ థియేటర్‌ను ఆధునిక టెక్నాలజీతో రీడిజైన్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తాజాగా కరీంనగర్‌లో శివ థియేటర్‌ను కూడా రెనొవేట్ చేసింది. సంక్రాంతి సినిమాలతో ఈ థియేటర్ ఆరంభం కానుంది.
మైత్రి నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్య పద్ధతిని కూడా అనుసరిస్తోంది. థియేటర్ ఓనర్లతో కలసి పలు ప్రాంతాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లను నూతనంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉంది.
ఈ విధానం వల్ల కొత్త థియేటర్లు ప్రేక్షకుల అవసరాలకు అనుగుణంగా మారుతున్నాయి.
ఇక 2025 నాటికి మరిన్ని థియేటర్లను కొనుగోలు చేసి, వీటిని సరికొత్తగా తీర్చిదిద్దాలని మైత్రి లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్రయత్నాలు మైత్రి మూవీ మేకర్స్ థియేటర్ బిజినెస్‌లో కూడా తమదైన ముద్ర వేయడంలో సహాయపడతాయని విశ్లేషకులు అంటున్నారు.