టాలీవుడ్‌లో దూసుకెళ్తున్న మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్, వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెడుతోంది. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల భారీ బడ్జెట్ చిత్రాల దాకా ఈ నిర్మాణ సంస్థ హవా కొనసాగుతోంది.
ఇప్పటికే 2025లో మైత్రి బ్యానర్ నుంచి భారీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మార్చి 28న నితిన్ ‘రాబిన్ హుడ్’, ఏప్రిల్ 10న సన్నీ డియోల్ ‘జాట్’, అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ రిలీజ్ కాబోతున్నాయి. రామ్ చరణ్ ‘RC 16’ కూడా మైత్రి బ్యానర్‌పై తెరకెక్కుతోంది.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 2026లో విడుదల కానుంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా 2025 సంక్రాంతికి రాబోతోంది. అలాగే ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ 2026లో థియేటర్లలోకి వస్తుంది.
ఇక నాని-సీబీ చక్రవర్తి మూవీ, రామ్ చరణ్-సుకుమార్ ప్రాజెక్ట్, చిరంజీవి-బాబీ కొల్లి చిత్రం 2026లో మొదలవ్వనున్నాయి. ఈ లైనప్‌తో మైత్రి ఇండస్ట్రీపై మరింత ప్రభావం చూపనుంది.
ఇంత భారీ సినిమాలన్నీ అంచనాలను అందుకుంటాయా? మైత్రి మరోసారి బ్లాక్‌బస్టర్ లెవల్‌ను కొనసాగిస్తుందా? అన్నది ఆసక్తిగా మారింది.