టాలీవుడ్: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్రేజ్ కోసమో లేదా పనితనం నిరూపించుకుంటే అవకాశాలు వస్తాయనో లేదా మరేదైనా కారణం చేతనో కొందరు సినిమా అఫిషియల్ అప్డేట్స్ కన్నా ముందే ఫస్ట్ లుక్ ని, న్యూ లుక్ అని పోస్టర్స్ విడుదల చేస్తున్నారు. కొన్ని సార్లు ఇవి నిజమైన పోస్టర్స్ లానే ఉన్నాయి అంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అయితే మొదట్లో తక్కువగా ఉన్న ఈ అప్ డేట్స్ పోను పోను పెరుగుతూ ఉండడం తో మూవీ మేకర్స్ వాటిపై క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటివి మేకర్స్ పైన ప్రెషర్ క్రియేట్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు.
మొన్న పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమా ఇంకా షూటింగ్ కూడా మొదలు పెట్టలేదు అప్పుడే ఫస్ట్ లుక్ అని సోషల్ నెట్వర్క్ లో ట్రెండింగ్ లో ఉంది. చూస్తే ఇది నిజంగానే అఫిషియల్ అన్నట్టుగా ఉంది. దీనిపై మేకర్స్ మైత్రి మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. మహేష్ బాబు హీరో గా రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమా ప్రకటనలపై కూడా చాల ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ అవుతుండడం తో అదే నిర్మాతలు తమ సినిమా అప్ డేట్స్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఇపుడు ఉన్న పరిస్థితుల్లో షూటింగ్స్ అన్ని ఆగిపోవడం తో , కొన్ని సినిమాలు అసలు మొదలు కూడా అవకపోవడం తో అనౌన్స్మెంట్స్ మరియు పోస్టర్స్ విడుదల చేయడానికి టైం పడుతుంది, ఈ సోషల్ మీడియా ఔత్సాహికులు ఈ విషయాన్ని అర్ధం చేసుకుని ఇవి తగ్గిస్తే మంచిదేమో.