టాలీవుడ్: కరోనా మొదటి వేవ్ ముగిసి థియేటర్ లు తెరుచుకున్న తర్వాత విడుదలై సూపర్ హిట్ అయిన కొన్ని మంచి సినిమాల్లో ‘నాంది’ ఒకటి. అల్లరి నరేష్ రెగులర్ ఫార్మాట్ లో కాకుండా సీరియస్ గా ఈ సినిమా సాగుతుంది. తన సెట్టిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు అల్లరి నరేష్. తన తప్పు లేకుండా దోషి గా ఒక వ్యక్తి జైలుకి వెళ్తే జైలు నుండి విడుదల అయిన తర్వాత తనకి జరిగిన అన్యాయానికి న్యాయ బద్ధంగా పోరాడే పాత్రలో అల్లరి నరేష్ మెప్పించాడు. మరో ముఖ్య పాత్రలో వర లక్ష్మి శరత్ కుమార్ మెప్పించారు.
అయితే ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ కానుంది. ఈ సినిమాని బాలీవుడ్ కి దిల్ రాజు మోసుకెళ్లారు. ఈ సినిమాని హిందీ లో దిల్ రాజు నిర్మించనున్నారు. కానీ ఒక్కరే కాకుండా అజయ్ దేవగన్ తో కలిసి నిర్మించనున్నాడు. అజయ్ దేవగన్ ‘A D F ఫిలిమ్స్’ మరియు దిల్ రాజు ‘శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్’ బ్యానర్ పై సంయుక్తంగా ఈ సినిమా నిర్మించనున్నట్టు ఈరోజు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో నటించే నటీ నటుల వివరాలు ఇంకా వ్యక్తపరచలేదు.