నాగ చైతన్య తన కెరీర్‌ను కొత్త దశలోకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. ‘తండేల్’తో భారీ విజయం సాధించిన ఆయన, ఇప్పుడు కొత్త జానర్స్ ట్రై చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఒక థ్రిల్లర్ మూవీ చేస్తున్న చైతు, త్వరలో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టనున్నాడని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, నాగ చైతన్య కొత్త దర్శకుడు కిషోర్‌తో ఒక ప్రయోగాత్మక కథ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఉండబోతుందని టాక్. కథ విన్న వెంటనే చైతు ఇష్టపడి, ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పాడని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాతో తన కెరీర్‌కు కొత్త మలుపు ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
‘తండేల్’ విజయంతో టాలీవుడ్‌లో చైతన్య క్రేజ్ మరింత పెరిగింది. లవ్ స్టోరీలు, ఫ్యామిలీ డ్రామాలు ఎక్కువగా చేసిన ఆయన, ఇప్పుడు హార్డ్ హిట్టింగ్ కాన్సెప్ట్‌ల వైపు వెళ్లాలని డిసైడ్ అయ్యాడట. ఈ కొత్త ప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
ఇప్పటివరకు చైతు ఫ్యాన్స్ ఆఫీషియల్ అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. తండేల్ తరువాత వచ్చే సినిమా ఎలాంటి కాన్సెప్ట్‌తో ఉంటుందనేది ఆసక్తిగా మారింది. కొత్త దర్శకుడితో ప్రయోగం చేయడం సాహసమే అయినా, అది చైతన్యకు కొత్త మైలురాయి అవుతుందా అనేది వేచి చూడాలి.