మూవీడెస్క్: టాలీవుడ్‌లో ఎట్టకేలకు అక్కినేని కుటుంబంలో పెద్ద అనౌన్స్మెంట్ వెలువడింది. హీరో నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం గురించి హీరో నాగార్జున స్వయంగా సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశారు.
నాగార్జున షేర్ చేసిన ఫొటోలో, నాగచైతన్య, శోభిత ధూళిపాళ్లలు ఇద్దరూ నవ్వుతూ, ఆనందంగా ఉన్నారు. ఈ ఫొటోలో, నాగార్జున మధ్యలో నిలబడి ఉండగా, చైతూ, శోభితలు ఇరువైపులా నిలబడి ఉన్నారు.
ఈ సందర్భంగా నాగార్జున సోషల్ మీడియాలో ఇలా రాశారు: ఈ రోజు ఉదయం 9:42కి మా కుమారుడు నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం జరిగింది.
ఆమెను మా కుటుంబంలోకి స్వాగతించడం చాలా ఆనందంగా ఉంది. వీరికి హృదయపూర్వక అభినందనలు. వీరి ప్రేమ, ఆనందం ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాం. దేవుడు వారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం.
ఈ ప్రకటనతో అక్కినేని కుటుంబంలో కొత్త ప్రారంభం అంటూ హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ప్రేమ బంధం గురించి చాలా ఊహాగానాలు వినిపించాయి.
ఈ అనౌన్స్మెంట్‌తో ఆ రూమర్స్‌కు తెరపడింది. వీరి వివాహ వేడుకకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడి కావచ్చని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.