మూవీడెస్క్: టాలీవుడ్ హీరో నాగ చైతన్య, బాలీవుడ్ నటి శోభిత దూళిపాళ్ల పెళ్లి డిసెంబర్‌లో జరుగబోతోందని టాక్ నడుస్తోంది.
కొద్ది నెలల కిందట వీరి ఎంగేజ్‌మెంట్ జరిగిందన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.
ఇప్పుడు శోభిత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్ల ఫోటోలు షేర్ చేయడంతో, పెళ్లి తేదీ దూరంలో లేదని మరింత స్పష్టత వచ్చింది.
ముందుగా డెస్టినేషన్ వెడ్డింగ్‌గానే అనుకున్నా, చివరకు హైదరాబాద్‌లోనే కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య గ్రాండ్‌గా పెళ్లి జరపాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
వీరి వివాహానికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
ఇకపోతే, ప్రస్తుతం నాగ చైతన్య ‘తండేల్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
డిసెంబర్ 20న విడుదల చేయాలనుకున్నా, షూటింగ్ పూర్తి కావడంలో కొంత ఆలస్యం వల్ల సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
ఇకపోతే, శోభిత కూడా ప్రాజెక్టులన్నీ పక్కనబెట్టి పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉంది.
పెళ్లి తర్వాత నాగ చైతన్య కొత్త ప్రాజెక్టులపై దృష్టిపెట్టనున్నారని టాక్.
అలాగే శోభిత కూడా తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.