fbpx
Thursday, January 16, 2025
HomeTop Movie Newsనాగ చైతన్య vs అజిత్: బాక్సాఫీస్ ఢీ

నాగ చైతన్య vs అజిత్: బాక్సాఫీస్ ఢీ

తెలుగు పరిశ్రమలో యువ సామ్రాట్ నాగ చైతన్య, తమిళనాట సూపర్‌స్టార్ అజిత్ మధ్య ఫిబ్రవరి బాక్సాఫీస్ రేసు హాట్ టాపిక్ గా మారింది. రెండు భాషల్లో ఈ ఇద్దరు స్టార్లు తమ కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

అజిత్ నటించిన ‘విడా ముయర్చి’ ఫిబ్రవరి 6న విడుదలకు సిద్ధమవుతోంది. అజిత్ తన మార్క్ యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకులను అలరించనుండగా, ఈ సినిమా ట్రైలర్ కోసం భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక నాగ చైతన్య నుంచి ‘తండెల్’ ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది. ఈ సినిమా చైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రంగా చెప్పబడుతోంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు పటిష్టమైన కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా, తమిళ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా కార్తికేయ 2 తర్వాత నేషనల్ వైడ్ హైప్ అందుకోవడం విశేషం.

ఈ రెండు సినిమాలు వేర్వేరు జానర్లకు చెందినవైనా, బాక్సాఫీస్ పోటీ తీవ్రత ఆసక్తికరంగా మారింది. అజిత్ తెలుగు మార్కెట్ విస్తరించేందుకు, చైతన్య తమిళ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈ రెండు సినిమాలు తమ తమ హీరోల కెరీర్‌లకు మైలురాయి అవుతాయా అన్నది వేచిచూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular