fbpx
Friday, September 20, 2024
HomeMovie Newsనాగ శౌర్య కొత్త ప్రాజెక్ట్ హై బడ్జెట్

నాగ శౌర్య కొత్త ప్రాజెక్ట్ హై బడ్జెట్

NAGA-SHOURYA-IN-HUGE-BUDGET-FILM
NAGA-SHOURYA-IN-HUGE-BUDGET-FILM

మూవీడెస్క్: హీరో నాగ శౌర్య తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయనటువంటి బిగ్ బడ్జెట్ సినిమా చేయబోతున్నారు.

గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ యువ హీరో, ఇప్పుడు మరింత గొప్ప విజయాన్ని అందుకోవాలనే లక్ష్యంతో సరికొత్త ప్రాజెక్ట్‌లో పాల్గొంటున్నాడు.

ఈ సినిమా ద్వారా డెబ్యూ డైరెక్టర్ రామ్ దేశిన తొలిసారిగా మెగాఫోన్ పట్టనున్నారు. శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాసరావు చింతలపూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ నాగ శౌర్య కెరీర్‌లో హైయెస్ట్ బడ్జెట్ మూవీగా నిలుస్తుందని, దీనికి సంబంధించిన కథ విభిన్నంగా, యూనివర్సల్ పాయింట్ ఆధారంగా ఉంటుందని టాక్ ఉంది.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు ప్రముఖ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. రసూల్ ఎల్లూరు సినిమాటోగ్రాఫర్‌గా, హ్యారిస్ జయరాజ్ సంగీత దర్శకుడిగా వర్క్ చేస్తున్నారు.

సముతిరకని, రాజేంద్రప్రసాద్, సాయికుమార్ వంటి ప్రముఖులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రెగ్యులర్ షూటింగ్ నేటి నుండి ప్రారంభమైంది.

నిర్మాత శ్రీనివాసరావు చింతలపూడి ఈ ప్రాజెక్ట్ పై భారీగా ఆశలు పెట్టుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular