హైదరాబాద్: లాక్ డౌన్ వల్ల సినిమా ప్రముఖులు అందరూ ఇంటికే పరిమితం అవ్వడం వల్ల కొంచెం ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియా లో గడుపుతూ అభిమానులతో వాల్ల గురించి కొన్ని కొత్త విషయాలు చెప్పుకొచ్చారు. కొందరు లైవ్ చాట్ లు చేస్తూ కొందరు ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఉన్నారు. అలాగే యువ సామ్రాట్ నాగ చైతన్య కూడా లొక్డౌన్ లో తాను చూసిన వెబ్ సిరీస్ గురించి ఒక పోస్ట్ పెట్టారు.
చెర్నోబిల్ – సోవియట్ యూనియన్ లో ఒక సిటీ, 1986 లో జరిగిన దారుణమైన న్యూక్లియర్ విస్ఫోటనం కి కేంద్ర బిందువు. ఈ చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్ లో విస్ఫోటనం జరిగిన తర్వాతి పరిస్థితుల మీద తీసిన వెబ్ సిరీస్ డిజిటల్ మాధ్యమాల్లో అందుబాటులో ఉంది.
లొక్డౌన్ మొత్తం లో నేను చూసిన మూవీస్ సిరీస్ ల్లో తనకి చెర్నోబిల్ బాగా నచ్చిందని ఎంతో అద్భుతంగా తీశారు, అద్భుతమైన రచన, నటన, నిర్మాణ విలువలు బాగున్నాయని పోస్ట్ చేశారు. అంతే కాకుండా చాలా స్ఫూర్తిదాయకంగా ఉందని చూడకపోతే చూడండి అని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.
ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వం లో ‘లవ్ స్టోరీ’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. లాక్ డౌన్ లేకపోయి ఉంటె ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ అవ్వాల్సింది. షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. చైతన్య ఈ సినిమా పై చాలా నమ్మకం పెట్టుకున్నారు.