టాలీవుడ్: ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో లవ్ స్టోరీ అంటే మొదట వినిపించే హీరో పేరు నాగ చైతన్య. అక్కినేని నట వారసత్వాన్ని కొనసాగిస్తూ కెరీర్ ప్రారంభమైన మొదట్లో కొంత విమర్శల పాలైనా కానీ ప్రస్తుతం కొన్ని హిట్ లు కొడుతూ మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటూ సక్సెస్ బాటలో నడుస్తున్నాడు. తన మామ వెంకటేష్ లాగానే సౌమ్య స్వభావుడిగా, ఎవరి జోలికి వెళ్లకుండా అందరూ అభిమానించే కారెక్టర్ తో ఇండస్ట్రీ లో కూడా చాలా మంది ఫాన్స్ ని సంపాదించాడు. నాగ చైతన్య ప్రస్తుతం సెన్సిబుల్ సినిమాలు తీసే డైరెక్టర్ శేఖర్ కమ్ముల తో ‘లవ్ స్టోరీ’ అనే సినిమా తీసాడు.
ఈ సినిమాలో ఒక మధ్య తరగతి యువకుడిగా నటించబోతున్నాడు. ఈ రోజు నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి నాగ చైతన్య కొత్త పోస్టర్ ని విడుదల చేసారు మూవీ టీమ్. ఈ సినిమాలో చైతూ కి జోడీ గా సాయి పల్లవి నటిస్తుంది. అర్బన్ రొమాంటిక్ అండ్ మ్యూజికల్ లవ్ స్టోరీ గా ఈ సినిమా రాబోతుంది. షూటింగ్ మొత్తం పూర్తి అయిన ఈ సినిమా థియేటర్ లు తెరచుకోగానే విడుదలకి సిద్ధం అవుతుంది. ఒక్కో సినిమాకి పరిణతి చెందుతూ అంచెలంచెలుగా ఎదుగుతున్న చైతూ ఈ సినిమా పైన బాగానే ఆశలు పెట్టుకున్నాడు.