హైదరాబాద్: అక్కినేని వారసుడు నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా , క్లాస్ మూవీలు తీసే డైరెక్టర్ గా పేరున్న శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘లవ్ స్టోరీ’. కరోనా కారణంగా చాలా గ్యాప్ వచ్చి షూటింగ్ పూర్తి చేయలేకపోయిన ఈ సినిమా ఎట్టకేలకి చివరి షెడ్యూల్ షూటింగ్ ని ప్రారంభించింది. ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ షూటింగ్ ప్రారంభించింది ఈ సినిమా టీం. సోనాల్ నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నారాయణ్ దాస్ కే నారంగ్, పి రామ్ మోహన్ రావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
లొకేషన్ లో కేవలం షూటింగ్ కి సంబందించిన 15 మంది మాత్రమే ఉండేట్లు చూసుకుని వాళ్ళకి కరోనా టెస్ట్ లు చేయించి వాళ్ళని ఇంటికి పంపించకుండా చివరి షెడ్యూల్ పూర్తి చేసి అది అయ్యాకే ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లేట్టు ఏర్పాట్లు చేసుకొని షూటింగ్ ప్రారంబిస్తున్నటు మేకర్స్ తెలిపారు. దాదాపు 15 రోజులు నాన్ స్టాప్ గా సినిమా షూట్ చేసి చివరి షెడ్యూల్ పూర్తి చేసి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కరోనా ని దృష్టిలో ఉంచుకుని షూటింగ్ లో సోషల్ డిస్టన్సింగ్, మాస్క్ లు ధరించడం వంటివి పాటిస్తున్నట్టు తెలిపారు.