అక్కినేని నాగార్జున తన కొత్త సినిమా ఎవరితో చేస్తారన్నదానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ‘కుభేర’ పూర్తయిన తర్వాత, ‘కూలీ’ షూటింగ్ కొనసాగుతోంది. కానీ సోలో సినిమాగా ఆయన ఏ దర్శకుడిని ఎంచుకుంటారనేది ఆసక్తిగా మారింది.
తాజా సమాచారం ప్రకారం, యువ దర్శకుడు మల్లిడి వశిష్ట నాగార్జునను కలిసి ఓ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను వినిపించారని తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి భేటీ జరగగా, నాగ్ కథను ఆసక్తిగా విన్నప్పటికీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.
ప్రస్తుతం వశిష్ట చిరంజీవితో ‘విశ్వంభర’ తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా పూర్తయిన తర్వాత నాగార్జునతో కొత్త ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడని టాక్. ఇది సోషల్ ఫాంటసీ కాన్సెప్ట్‌లో భారీ విజువల్స్‌తో ఉండే అవకాశం ఉంది.
టాలీవుడ్‌లో ప్రస్తుతం వెంకటేష్, నాగార్జున మాత్రమే కొత్త ప్రాజెక్ట్‌ల కోసం అందుబాటులో ఉన్నారు. అందువల్ల వశిష్ట దృష్టి పూర్తిగా నాగ్‌పై ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మొత్తానికి, నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఇది అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందే భారీ సినిమా కానుంది. మరి, ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది.