టాలీవుడ్: టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున తన తదుపరి సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. మన్మధుడు 2 , ఆఫీసర్ ప్లాప్ తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకుని ‘వైల్డ్ డాగ్’ అనే యాక్షన్ మూవీ తీసాడు. ఈ సినిమా విడుదలకి సంబందించిన వివాదం నడుస్తుండడం తో ఇంకా విడుదలకి నోచుకోలేదు. అందరూ షూటింగ్స్ మొదలుపెడుతున్నా కూడా నాగార్జున తన తదుపరి సినిమా పైన ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వలేదు. ప్రస్తుతం డైరెక్ట్ గా పూజ కార్యక్రమాలతో షూటింగ్ మొదలు పెట్టి ఆఫీషియల్ గా ప్రకటించారు. బాలీవుడ్ లో చేస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చిన నాగార్జున వెంటనే తన తదుపరి సినిమా ప్రారంభించాడు.
చందమామ కథలు, పి.ఎస్.వి.గరుడవేగా, రొటీన్ లవ్ స్టోరీ, గుంటూరు టాకీస్ లాంటి సినిమాలని రూపొందించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ప్రస్తుతం నాగార్జున ఈ దర్శకుడితో కలిసి పని చేయనున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ రూపొందబోయే సినిమా షూటింగ్ నిన్ననే పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఫుల్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రూపొందనుందని నాగార్జున తెలియ చేసారు. ఏషియన్ మూవీస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, రామ్ మోహన్ రావు మరియు శరత్ మరార్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.