టాలీవుడ్: అక్కినేని నాగార్జున కొంత గ్యాప్ తర్వాత హీరోగా నటించి విడుదల చేయబోతున్న సినిమా ‘వైల్డ్ డాగ్’. రేపు ఈ సినిమా థియేటర్లలో విడుదల అవబోతుంది. ఈ సినిమాలో నాగార్జున విజయ్ వర్మ అనే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA ) ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా స్పెషల్ షో కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది సినీ ప్రముఖులు ఈ సినిమా గురించి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.
రేపు విడుదలవబోతున్న ఈ సినిమా గురించి ఒక వినూత్న రీతిలో ప్రొమోషన్ చేసింది సినిమా టీం. రేపు విడుదలవుతున్న మా సినిమాని ఎవరో లీక్ చేసి యూ ట్యూబ్ లో పెట్టారు, దయ చేసి మీరు యూ ట్యూబ్ లో చూడకుండా థియేటర్లలోనే చూడండి అని కింద యూట్యూబ్ లింక్ ని కూడా జత చేసారు. తీరా తెరచి చూస్తే అందులో కేవలం ‘రేపటి నుంచి థియేటర్లలో.. వైల్డ్ డాగ్’ అని చూపించారు. దాదాపు రెండు గంటల నిడివి ఉన్న ఈ వీడియో ఒక సినిమా ఫుల్ లెంగ్త్ సినిమా వీడియో లాగా తయారు చేసి కొత్త తరహా ప్రచారం చేసింది సినిమా టీం.
మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ సినిమాని రూపొందించారు. అహిషోర్ సోలమన్ అనే దర్శకుడు ఈ సినిమా ద్వారా తెలుగుకి పరిచయం అవుతున్నాడు. ఒక పూర్తి ఇన్వెస్టిగేషన్ కథతో రూపొందించబడిన ఈ సినిమాలో పాటలేవి లేవు. ఈ సినిమాని నేపధ్య సంగీతం థమన్ అందించాడు. అన్ని హంగులు పూర్తి చేసుకుని రేపు థియేటర్లలో ఈ సినిమా విడుదలవనుంది.