హైదరాబాద్: నాగ శౌర్య నటిస్తున్న 20 వ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు విడుదల చేసారు సినిమా టీం.
ఈ ఫస్ట్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. తాను ముందే చెప్పినట్టు ఒక ప్రాచీనమైన ఆటతో వస్తున్నట్టు ఈ సినిమా ఫస్ట్ లుక్ లో విల్లు ఎక్కు పెట్టే మోడరన్ యోధుడిలా ఉన్నాడు నాగ శౌర్య. ఇంతకముందు అశ్వద్ధామ లాంటి పవర్ఫుల్ టైటిల్ తో వచ్చి మాస్ హీరోగా నిరూపించుకోవడానికి ఒక మంచి ప్రయత్నమే చేసాడు. సినిమా అంతగా ఆడనప్పటికీ శౌర్య కి మంచి పేరొచ్చింది. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఈ సినిమాకి మరింత కష్టపడి సిక్స్ ప్యాక్ బాడీ బిల్డ్ చేసి ఫస్ట్ లుక్ తోనే సినిమాకి మంచి బజ్ తీసుకొచ్చాడు శౌర్య. దీంతో సినిమా రీచ్ కొంత పెరిగినట్టే అని చెప్పుకోవచ్చు. తాజా మూవీ కోసం అతడు శారీరకంగా కఠోరంగా శ్రమించాడని అర్థమవుతోంది. ఈ కొత్త లుక్ కి ఇండస్ట్రీ నుండి కూడా చాలా మంది ప్రముఖుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.
ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఈ రోజు క్లాసిక్ మూవీ డైరెక్టర్ ‘శేఖర్ కమ్ముల’ విడుదల చేసారు. నాగ శౌర్య గురించి తన కష్టం గురించి చిన్న వీడియో ద్వారా చెప్పి ఈ సినిమా టీం కి బెస్ట్ విషెస్ తెలియచేసారు. మరో అద్భుతమైన టైటిల్ తో వచ్చి ఈ సినిమా మంచి విజయం పొందాలని ఆశిద్దాం.