టాలీవుడ్: అశ్వద్ధామ సినిమా తర్వాత నాగ శౌర్య రక రకాల కథలు ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా ఒక స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా లో నటిస్తున్నాడు. ‘లక్ష్య’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ఒక ఆర్చరీ ఆటగాడిగా కనిపిస్తున్నాడు. తెలుగు సినిమాల్లో ఆర్చరీ నేపధ్యం లో ఫుల్ లెంగ్త్ రోల్ ఐతే ఇప్పటివరకు ఎవరూ ప్రయత్నించలేదు, ఈ క్యాటగిరి లో శౌర్య నే మొదటివాడు అవుతాడు. సోనాలి నారంగ్ సమర్పణలో వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ కె నారంగ్ , పుష్కర్ రామ్మోహన్ రావు , శరత్ మరార్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. నాగ శౌర్య 20 వ సినిమాగా రూపొందిన ఈ సినిమా టీజర్ శౌర్య పుట్టిన రోజు సందర్భంగా విడుదలైంది.
ఆట ఆడితే ఆడిన వాళ్ళకి గుర్తింపు వస్తుంది కానీ కొందరు ఆడితే ఆటకి గుర్తింపు వస్తుంది అని ఒకే ఒక లైన్ లో ఈ సినిమాలో హీరో ఎంత మంచి ఆటగాడో ట్రైలర్ మొదట్లో చూపించారు. ఈ సినిమాలో పార్థూ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఒక మంచి ఆటగాడు కొన్ని కారణాల వలన ఆటకి దూరమై ముందుకు బానిసై మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తన ఆటని ప్రదర్శించి ‘పడి లేచిన వాడితో పందెం.. చాలా ప్రమాదకరం’ అనే డైలాగ్ తో టీజర్ ముగించారు. టీజర్ వరకు పూర్తి సిరీస్ నోట్ లో ఒక కొత్త రకమైన సినిమా చూడబోతున్నాం అనే ఫీల్ అయితే కలిగించారు. శౌర్య కి జోడీ గా ఈ సినిమాలో కేతిక శర్మ నటిస్తుంది. ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. సినిమా విడుదల తేది మరి కొన్ని రోజుల్లో ప్రకటించనున్నారు.