టాలీవుడ్: ఈ సంవత్సరం తన సొంత బ్యానర్ లో ‘అశ్వద్దామ’ సినిమా ద్వారా పలకరించి పరవాలేదనిపించాడు నాగ శౌర్య. కరోనా వల్ల వచ్చిన చాలా సమయాన్ని బాగానే వాడుకున్నట్టున్నాడు. కొత్త సినిమాలు చేయడంలో దూకుడు చూపెడుతున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ నుండి యాక్షన్ హీరోగా మారడానికి చాలానే కష్టపడుతున్నాడు ఈ హీరో. ప్రస్తుతం ఇటు లవ్ స్టోరీస్ అలాగే యాక్షన్ స్టోరీస్ కలిపి చేస్తున్నాడు. నాగ శౌర్య ప్రస్తుతం సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ డ్రామా లో నటిస్తున్నాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ‘లక్ష్మి సౌజన్య’ అనే కొత్త దర్శకురాలి ఆధ్వర్యంలో మరొక సినిమాలో కూడా నటిస్తున్నాడు. వీటితో పాటు నిన్ననే తన సొంత బ్యానర్ లో మరొక సినిమా ప్రారంభించాడు ఈ కుర్ర హీరో.
‘ఆలా ఎలా’, ‘లవర్’ చిత్రాలని రూపొందించిన దర్శకుడు ‘అనీష్ కృష్ణ’ ఈ సినిమాని రూపొందించబోతున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందబోతున్న ఈ సినిమాని నాగ శౌర్య హోమ్ బ్యానర్ లో రూపొందించబడుతుంది. శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మల్పూరి ఈ సినిమాని నిర్మించనున్నారు. ‘చలో’ సినిమాకి సూపర్ హిట్ ఆల్బమ్ అందించిన ‘మహత్ సాగర్’ ఈ సినిమాకి సంగీతం ఇవ్వనున్నాడు. ఈ సినిమా ఆరంభ సీన్ కి కొరటాల శివ క్లాప్ కొట్టి , అనిల్ రావిపూడి దర్శకత్వం వహించి గ్రాండ్ గా షూటింగ్ ప్రారంభించాడు.