హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ బన్నీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు తీర్పు వెలువడేవరకు వేచి చూడాలని న్యాయవాదులు కోరారు.
అయితే, కోర్టు ఈ విన్నపాన్ని తిరస్కరించి రిమాండ్ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు మేరకు, బన్నీని చంచల్ గూడ జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే, హైకోర్టు పిటిషన్‌పై విచారణ జరుగుతుండటంతో, హైకోర్టు తీర్పు వచ్చాకే రిమాండ్ విషయంలో స్పష్టత వస్తుందని అధికారులు వెల్లడించారు.
ఒకవేళ హైకోర్టులోనూ బన్నీకి అనుకూలత రాకపోతే, కోర్టు వెనుక గేటు ద్వారా బన్నీని తరలించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
చంచల్ గూడ జైలు వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాలు అల్లు అర్జున్ అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.