ఏపీ: వైసీపీకి సంబంధించి గడచిన కొన్ని రోజులుగా ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటించి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు.
తాజాగా సోమవారం సుప్రీంకోర్టు తీర్పు వైఎస్ జగన్‌కు ఊరట కలిగించగా, మంగళవారం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు బెయిల్ మంజూరైంది.
గుంటూరు జైలులో ఉన్న నందిగం సురేశ్ బుధవారం విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన సురేశ్, అమరావతి రాజధాని ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.
దళిత సామాజిక వర్గానికి చెందిన సురేశ్, రాజకీయాల్లో తన పంచాయితీ ధోరణితో ప్రత్యేక గుర్తింపు పొందారు.
2019లో బాపట్ల నుంచి ఎంపీగా విజయం సాధించిన నందిగం సురేశ్, ఆ సమయంలో వైఎస్ జగన్ కీలక సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
అయితే, 2024 ఎన్నికల్లో మాత్రం ఓటమి చవిచూశారు. సురేశ్‌కు బెయిల్ లభించడం వైసీపీ వర్గాల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఇకపై ఆయన రాజకీయాల్లో మరింత చురుకుగా ఉంటారని పార్టీలో చర్చ జరుగుతోంది.