కథ:
చందు (హర్ష్ రానా) చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే ఒక సాధారణ యువకుడు. జాబిలి (శ్రీదేవి) అనే అమ్మాయిని ప్రేమించడంతో అతని జీవితంలో ఊహించని మలుపు తిరుగుతుంది. కానీ జాబిలి మావయ్య మంగపతి (శివాజీ) వారిని విడదీయడానికి చట్టాన్ని అస్త్రంగా మార్చుకుంటాడు. పోక్సో చట్టం కింద కేసు పెట్టించి, చందును జైల్లో వేస్తాడు. పోక్సో దుర్వినియోగం ప్రశ్నల నడుమ, జూనియర్ లాయర్ తేజ (ప్రియదర్శి) ఈ కేసును టేకప్ చేస్తాడు. అసలు చందు నిర్దోషి అని తేజ ఎలా నిరూపించాడనేదే కథ.
విశ్లేషణ:
కోర్ట్ సినిమా కోర్ట్ డ్రామా జానర్లో ఓ విభిన్న ప్రయత్నం. చట్టాల్లోని లొసుగులను కొందరు తమ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకుంటారు? అమాయకులు ఎంత దూరం పోతారు? అనే పాయింట్లను హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగినా, సెకండ్ హాఫ్ మొదలైన వెంటనే థ్రిల్ మొదలవుతుంది. కోర్ట్ లో జరగే వాదనలు ఎలాంటి హడావుడి లేకుండా సిస్టమేటిక్ గా సాగడం ఆకర్షణగా మారింది.
శివాజీ మంగపతి పాత్రలో భయపెట్టే విలన్ గా కనిపిస్తే, ప్రియదర్శి తన న్యాయవాది పాత్రలో బలమైన ఇంపాక్ట్ కలిగించాడు. హీరోయిన్ పాత్రను ఇంకా బాగా ప్రెజెంట్ చేస్తే బావుండేదని అనిపిస్తుంది. టెక్నికల్‌గా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.
ప్లస్ పాయింట్స్:
శివాజీ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్
ప్రియదర్శి న్యాయవాది పాత్ర
కోర్ట్ డ్రామాలో కొత్త కోణం
కథనంలో లాజిక్, ప్రాక్టికాలిటీ
మైనస్ పాయింట్స్:
ప్రేమకథ పండించడంలో లోపం
హీరో పాత్రలో ఎమోషన్ మిస్
కొన్ని ప్రెడిక్టబుల్ సీన్స్
రేటింగ్: 3 / 5