మూవీడెస్క్: ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రారంభమైన నాని, ఇప్పుడు స్టార్ హీరోగా తన స్థాయి పెంచుకున్నారు.
అష్టా చమ్మా తో హీరోగా మారిన నాని, తన సొంత నటనా శైలితో ‘నేచురల్ స్టార్’ అనే ట్యాగ్ పొందారు.
ఎప్పుడూ విభిన్నమైన కథలు ఎంచుకుని, ప్రతి సినిమాతో ప్రేక్షకులను అలరిస్తూ, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
గత ఏడాది దసరా, హాయ్ నాన్న వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని, ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాతో మరో హిట్ అందుకున్నారు.
మూడు సక్సెస్లతో నాని హ్యాట్రిక్ కొట్టినట్టే. ఈ సినిమాతో అతి తక్కువ గ్యాప్ లో రెండు సార్లు రూ.100 కోట్ల క్లబ్ లో చేరారు. ఇది నాని కెరీర్ లో పెద్ద మైలురాయిగా చెప్పుకోవచ్చు.
నాని విజయానికి కారణం, కథల ఎంపికలో చూపుతున్న జాగ్రత్త అని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.
ఆయన డెబ్యూ డైరెక్టర్లను నమ్ముతూ, కొత్త ప్రయోగాలను చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. కథలో డెప్త్ ఉందనుకుంటే, గత ఫ్లాపుల గురించి పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు.
ఇవే నాని సక్సెస్ సీక్రెట్స్ గా చెప్పవచ్చు.