నేచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్‌లో తెరకెక్కిన హిట్-3 మోస్ట్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా మే 1న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి భారీ రెస్పాన్స్ వస్తోంది. కేవలం 24 గంటల్లో 21 మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసింది.
ట్రైలర్ చూసినవారంతా ఇది బ్లడీ, ఇంటెన్స్ యాక్షన్ మూవీ అని భావిస్తున్నారు. అయితే నాని ఇమేజ్ అంటే ఎక్కువగా క్లాస్ ఫిల్మ్స్ గుర్తుకు వస్తాయి. కానీ దసరా మూవీతో మాస్ అంగిల్ చూపించి హిట్ కొట్టారు. ఇప్పుడు హిట్-3తో మరోసారి తన యాక్షన్ సైడ్ చూపించబోతున్నారు.
ట్రైలర్ ఈవెంట్‌లో నాని క్లాస్ సినిమాలకే అలవాటుపడ్డ ఫ్యాన్స్‌కు ఓ వార్నింగ్ ఇచ్చారు. “మే 1న జాగ్రత్తగా ఉండండి” అని స్వయంగా చెప్పారు. “వయోలెన్స్ ఓకే అయితే చూడండి” అని ముందుగానే స్పష్టతనిచ్చారు.
మీడియాతో మాట్లాడిన నాని, వయోలెన్స్ వల్ల ఒక వర్గం ప్రేక్షకులు తప్పుకుంటే మరో వర్గం వస్తుందని ధైర్యంగా చెప్పారు. ఈ ఓపెన్ స్టేట్‌మెంట్ వల్ల నానికి కంటెంట్‌పై ఎంత నమ్మకముందో స్పష్టమవుతోంది.
ఇక తర్వాతి సినిమా ప్యారడైజ్ బోల్డ్ కాంటెంట్ తో వస్తున్నట్లు నాని ఇప్పటికే క్లూ ఇచ్చారు. వరుసగా డిఫరెంట్ జోనర్స్‌లో ప్రయోగాలు చేస్తూ, ఫ్యాన్స్‌ను ముందుగానే ప్రిపేర్ చేయడం నానికి ప్రత్యేకతగా మారింది.