నేచురల్ స్టార్ నాని నటించిన క్రైమ్ థ్రిల్లర్ హిట్ 3 సినిమా మే 1న విడుదల కానుంది. శైలేష్ కొలను డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా హిట్ యూనివర్స్ సిరీస్‌లో మూడో భాగంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నానీ స్టైలిష్ యాంగ్రీ లుక్, యాక్షన్ మూడ్ ట్రైలర్ ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.
ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన స్పెషల్ పబ్లిసిటీ ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇక ఈ నెల 27న తిరుపతిలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. ఈ ఈవెంట్‌కి భారీ స్థాయిలో అభిమానులు హాజరవ్వనున్నారని సమాచారం. మరోవైపు సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్ అందించేందుకు నాని స్పెషల్ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు.
ఇందులో భాగంగా నాని అమెరికా టూర్‌కు బయలుదేరినట్టు సమాచారం. హిట్ 3 రిలీజ్ అనంతరం యుఎస్‌లోని ప్రధాన నగరాల్లో ఫ్యాన్స్‌ను కలవనున్నారు. ప్రీమియర్ షోలు, మీడియా ఇంటరాక్షన్లతో ప్రమోషన్ జోరుగా సాగనుంది. ఇప్పటికే అమెరికాలో నానికి భారీ క్రేజ్ ఉండటం ఈ సినిమాకు కలిసొచ్చే అంశంగా మారనుంది.
హై నాన్న, దసరా, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాల విజయంతో అక్కడ నానికి స్ట్రాంగ్ ఫాలోయింగ్ పెరిగింది. ఆ క్రేజ్‌ను మరింతగా క్యాష్ చేసేందుకు నాని ఈసారి విదేశీ ప్రేక్షకుల మధ్య తన మాస్ క్రేజ్ ని చూపించబోతున్నారు. USA బాక్సాఫీస్ దగ్గర హిట్ 3 మంచి ఓపెనింగ్స్ సాధించే అవకాశం కనిపిస్తోంది.