టాలీవుడ్: వాల్ పోస్టర్ అనే సంస్థ ని ప్రారంభించి ఆ సంస్థ ద్వారా వైవిధ్య మైన సినిమాలని రూపొందిస్తూ కొత్త టాలెంట్ ని పరిచయం చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నాడు నాని. ఈ బ్యానర్ లో ప్రముఖ సినిమా కాస్ట్యూమ్ డిసైనర్ ప్రశాంతి భాగస్వామ్యంలో ఉన్నారు. ఈ మధ్యనే ఈ బ్యానర్ నుండి ‘మీట్ క్యూట్‘ అనే సినిమా ప్రకటించి షూటింగ్ మొదలుపెట్టినట్టు చూపించారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు సత్య రాజ్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా గురించి మిగతా విషయాలేవీ తెలుపలేదు. ఈ సినిమా డైరెక్టర్ దీప్తి గంట అనే కొత్త అమ్మాయి అని మాత్రమే తెలుసు.
తర్వాత తెలిసింది ఏంటంటే దీప్తి గంట ఎవరో కాదు స్వయానా నాని కి సొంత అక్క. మొత్తం గా చూసుకుంటే ఇపుడు తన నిర్మాణంలో అక్కని డైరెక్టర్ చేయబోతున్నాడు నాని. ఇండస్ట్రీ లో లేడీ డైరెక్టర్ ల పేర్లు చాలా తక్కువే అని చెప్పుకోవాలి. మంచి సినిమాలు తీసి తన టాలెంట్ నిరూపించుకున్న నందిని రెడ్డి, ఈ మధ్యనే ఆకాశమే హద్దురా లాంటి బ్లాక్ బస్టర్ రూపొందించిన సుధా కొంగర, నాగ శౌర్య హీరోగా నటిస్తున్న ‘వరుడు కావలెను’ సినిమాని డైరెక్ట్ చేస్తున్న లక్ష్మి సౌజన్య, శ్రీకాంత్ కొడుకు రోషన్ నటిస్తున్న ‘పెళ్లి సంద D ‘ సినిమాని డైరెక్ట్ చేస్తున్న గౌరీ రోణంకి. ఈ సినిమాతో ప్రస్తుతం ఉన్న లేడీ డైరెక్టర్ ల జాబితాలోకి నాని సిస్టర్ కూడా జత అవనుంది.