టాలీవుడ్: నాచురల్ స్టార్ నాని విజయవంతంగా 25 సినిమాలు పూర్తి చేసాడు. మొన్న లాక్ డౌన్ లో తన 25 వ సినిమాగా మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో ‘వీ’ సినిమా విడుదలైంది. టాక్ పరంగా ఈ సినిమా నిరాశ పరిచింది. దీని తర్వాత నాని మూడు సినిమాలని లైన్ లో పెట్టాడు. నిన్ను కోరి, మజిలీ డైరెక్టర్ శివ నిర్వాణ తో ‘టక్ జగదీశ్’ అనే సినిమా షూటింగ్ మధ్యలో ఉంది. దీనితో పాటు ‘టాక్సీ వాలా‘ లాంటి సినిమాతో మొదటి సినిమానే కలెక్షన్స్ తో పాటు కొత్త కాన్సెప్ట్ తో సూపర్ హిట్ కొట్టాడు అనిపించుకున్న ‘రాహుల్ సాంకృత్యాన్’ దర్శకత్వం లో ‘శ్యామ్ సింఘరాయ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ రోజే ప్రారంభం అయింది. మొదటి షాట్ ని తన తండ్రి గారి ద్వారా క్లాప్ కొట్టించి షూటింగ్ మొదలు పెట్టాడు నాని.
ఈ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుంది. ఈ సినిమాలో నాని రెండు క్యారెక్టర్లు వేయనున్నట్టు టాక్ కూడా ఉంది. ఇప్పటికి విడుదలైన టైటిల్ పోస్టర్, ప్రీ లుక్ లు సినిమా పైన ఆసక్తి ని కలిగించాయి. ఈ సినిమాలో నాని కి జోడీ గా ‘సాయి పల్లవి’ మరియు ఉప్పెన హీరోయిన్ ‘కృతి శెట్టి’ నటిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమాని వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి హృద్యమైన సంగీతాన్ని అందించే మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు ‘బ్రోచేవారెవరురా’ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో కలిసి ‘అంటే సుందరానికి’ అనే సినిమా కూడా చేస్తున్నాడు. మొత్తానికి తన దగ్గరి నుండి వచ్చే సంవత్సరం మూడు సినిమాలు పక్కా గా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడు నాని.