టాలీవుడ్: నాచురల్ స్టార్ నాని ‘వీ’ సినిమా తర్వాత ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘టక్ జగదీశ్’. ఈ సినిమా శివ నిర్వాణ దర్శకత్వం లో రూపొందుతుంది. ఆ తర్వాత ఒక కేజ్రీ సినిమాని ప్లాన్ చేసాడు నాని. ‘టాక్సీ వాలా‘ లాంటి సినిమాని రూపొందించి అందరి ప్రశంసలు పొందిన ‘రాహుల్ సంకృత్యాన్’ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. కలకత్తా మహానగరం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందించబడుతుంది. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన ఒక ప్రకటన వెలువడింది. ఈ సినిమాలో హీరోయిన్ లుగా ‘సాయి పల్లవి’ అలాగే ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా నటించిన ‘క్రితి శెట్టి’ ని ఎంచుకున్నారు. ఒక సినిమా కూడా విడుదల కాకుండానే ఇలాంటి ఒక పెద్ద సినిమాని రెండవ సినిమా ఆఫర్ పొందిందంటే ఉప్పెన హీరోయిన్ క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమాని డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు మేకర్స్ తెలిపారు.
నాచురల్ స్టార్ నాని పెర్ఫార్మన్స్, సాయి పల్లవి పెర్ఫార్మన్స్ గురించి తెలిసిన విషయమే. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. మొదటి సినిమా MCA రొటీన్ సినిమా. కానీ ఈ సినిమా నేపధ్యం వేరు, కథ కూడా కొత్తదనం తో కూడుకున్న కథ అని ఫస్ట్ లుక్ ద్వారా, బ్యాక్ డ్రాప్ ద్వారా తెలుస్తుంది. ఇద్దరు సూపర్ పెరఫార్మర్లు ఈ సినిమాలో ఉండేసరికి అలాగే ఫస్ట్ లుక్ కొంత ఇంటరెస్టింగ్ గా ఉండేసరికి ఈ సినిమా పైన అంచనాలు మెల్ల మెల్లగా పెరుగుతున్నాయి. ఈ రోజు విడుదల చేసిన ఒక పోస్టర్ లో కూడా నాని మీసాలు మెలేసి ఒక కొత్త లుక్ లో ఉన్నాడు. వీటి ఆధారంగా ఎదో ఒక కొత్త రకమైన అట్టెంప్ట్ లాగ కనిపిస్తుంది. చాల రోజులుగా మంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నాని ఈ సినిమా కోసం చాలా జాగ్రత్తలు పడుతున్నాడు. ఈ సినిమాని మెలోడియస్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.