మూవీడెస్క్: నేచురల్ స్టార్ నాని వరుస విజయాలు. 2008లో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించాక, కొద్దికాలం గ్యాప్ తరువాత నేను లోకల్ వంటి సినిమాల ద్వారా వరుస సక్సెస్‌లను అందుకుంటూ వచ్చాడు.
మాస్ లేదా క్లాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన నాని సరిపోదా శనివారం సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందుకుంటోంది.
దసరా, హాయ్ నాన్న తరువాత ఇది హ్యాట్రిక్ సక్సెస్. అసలు నాని సక్సెస్ సీక్రెట్ ఏమిటంటే, అతను ఎప్పటికప్పుడు కథలను కొత్తగా ఎంచుకుంటూ, ప్రేక్షకులకు తన ప్రతీ సినిమాతో కొత్త అనుభవాన్ని అందిస్తుంటాడు.
ముఖ్యంగా, నాని కథల ఎంపికలో వేరే హీరోల కంటే భిన్నంగా ఉండటం, ప్రతి సినిమాలో కూడా ఎమోషనల్ ఎలిమెంట్స్‌కి ప్రాధాన్యం ఇవ్వటం అతని సక్సెస్‌లో కీలకమైన అంశం.
ఎమోషనల్ సీక్వెన్స్ అనేవి ప్రేక్షకులకు వారి స్వంత జీవితాలను ప్రతిబింబించేలా ఉంటాయి. అందుకే ఆయా సినిమాలు పబ్లిక్‌కి బాగా కనెక్ట్ అవుతాయి.
తన తాజా చిత్రాలను పరిశీలిస్తే, దసరా లాంటి మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు చేస్తూనే, శ్యామ్ సింగరాయ్ వంటి పీరియాడిక్ కథలతో ప్రయోగాలు చేయడంలో నాని ముందుంటాడు.
అలాగే హాయ్ నాన్న వంటి చిత్రాల్లో తండ్రి కూతుళ్ల బంధం వంటి సున్నితమైన అంశాలను చూపిస్తూ, కుటుంబ ప్రేక్షకులకి దగ్గర అవుతాడు.
నాని ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచులను అర్థం చేసుకొని, కథలను విభిన్న జోనర్లలో ఎంచుకుంటున్నాడు.
అలాగే ఎమోషన్లతో స్ఫూర్తివంతమైన కథల్ని చూపించడం వల్లే వరుస సక్సెస్ లు దక్కుతున్నాయి.